SBI లో కావాల్నా..రైల్వేలోనా

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటూ అంతరాష్ట్ర కేటుగాళ్ల మోసం
  • నిరుద్యోగులనుంచి రూ.4 కోట్లదాకా వసూలు

వెంకీ సినిమా చూశారా..? నీకు జింకులో కావాల్నా,బంకులో కావాల్నా అంటూ హీరో, అతడి స్నేహితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వల విసురుతాడు ఓ కన్నిం గ్ ఫెలో. చివరకు అదంతా మోసమని తెలుసుకుంటారు మనోళ్లు. సేమ్ అలాంటి సీన్ బయట రిపీట్​ అయింది. కాకపోతే.. అక్కడ జింకు, బంకు..ఇక్కడ ఎస్బీఐ, రైల్వే, ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో తెలుగు రాష్ట్రా లకు చెందిన వంద మందిని మోసం చేసి ₹3 కోట్ల నుంచి ₹4 కోట్ల దాకా వసూలు చేసిన కిలాడీ గ్యాం గ్ ను పోలీసులు పట్టుకున్నారు. 12 మంది అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురి ని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.. ఒడిసా బైరంపూర్ కు చెందిన కలు చరణ్ పాండ (33) అలియాస్​ అజయ్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం కోల్ కతాకు బతుకుదెరువు కోసం వెళ్లాడు. ఇంటర్ వరకే చదివిన అతడికి ‘ఈజీ మనీ’ అనే దుర్బు ద్ధి పుట్టింది . అతడి స్నేహితులైన కలీనాథ్ రాయ్ , రాజీవ్ కార్తీక్ , హేమంత్ , అనిల్ తో కలిసి కోల్ కతాలో ఫేక్ జాబ్ కన్సల్టెన్సీ ని పెట్టా డు. ఈ క్రమంలో ఓసారి హైదరాబాద్ లోని  ఓకన్సల్టెన్సీ లో పరిచయమైన హైదరాబాద్ కే చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి తన ఆలోచన గురించి చెప్పాడు. అతడితో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కడియం సంధ్యారాణి, మురళీకృష్ణ, వీర రాఘవేందర్ , వెంకటేశ్ ,అశోక్ రావు అనే వ్యక్తుల సహకారంతో రైల్వే, ఎస్బీఐ,ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్లలో జాబ్స్ అంటూ నిరుద్యోగులకు ఆశ చూపించారు. అలా తెలుగు రాష్ట్రాల్లో ని వంద మందికి వల వేశారు. ఒక్కొ క్కరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. తర్వాత వారికి కోల్ కతాలో ఏర్పాటు చేసిన నకిలీ ఎస్బీఐ ట్రైనిం గ్ సెంటర్ లో మూడు నెలలు కోచింగ్ ఇప్పించాడు. ఆ కోచింగ్ కూ డబ్బులు వసూలు చేశాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫేక్ అపాయింట్​మెంట్​ లెటర్లు, కాల్ లెటర్స్ ను తయారు చేయించాడు. వాటిపై ఎస్బీఐ ఉన్నతాధికా రులతో పాటు, ఇతర విభాగాలకు చెందిన అధికా రుల సంతకాలను ఫోర్జరీ చేసి, వాటిని బాధితు లకు ఇచ్చాడు. అందులో పేర్కొన్న తేదీన ఫోన్ చేస్తే ఎక్కడికెళ్లాలో చెప్తామని చెప్పి వారిని పంపించారు. ఆతేదీన శ్రీకాంత్ కు బాధితు లు ఫోన్ చేయగా కలవలేదు. ఆందోళన చెంది.. మిగతా నిందితు లకు ఫోన్ చేసినా వారి ఫోన్లూ అంతే. దీంతో మోసపోయామని గ్రహించిన  నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రమేశ్ , అశోక్ , విష్ణు, మహేశ్ అనే బాధితు లు ఉ ప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడైన చరణ్ పాండతో పాటు మురళీ కృష్ణ, మేడపతి వీరబాబు, వీర రాఘవేందర్, కడియం సంధ్యారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ ను నాలుగు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పాండ స్నేహితులతో పాటు అశోక్ రావు, వెంకటేశ్ ల కోసం గాలిం పు చేపట్టారు. కాగా, ఇలా సంపాదించిన డబ్బుతో కోల్ కతాలో పాండ ₹50 లక్షల విలువైన ఇల్లు, కారు, బంగారం కొన్నట్టు పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి ఫేక్ అపాయింట్​మెంట్లతో పాటు ₹10 లక్షలు, సెల్ ఫోన్లు, ₹15 లక్షల విలువైన కారు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసు కున్నారు.

Latest Updates