పరీక్షల్లో తప్పింది: ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

inter-student-commits-suicide-due-to-exam-failure

మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన లావణ్య.. పరీక్షల్లో తప్పినందుకు మూడు రోజుల క్రితం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఐతే నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో లావణ్యను కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వారు అడ్మిట్ చేసుకోలేదు. దీంతో లావణ్యను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మరణించింది. విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్.. ఆస్పత్రిలో లావణ్య తల్లిదండ్రులను పరామర్శించారు.

Latest Updates