ఇంటర్ లో ఫెయిల్..విద్యార్థిని సూసైడ్

రంగారెడ్డి : ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగింది. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన  జ్యోతి  (17) ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదింవింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పొసుకొని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పీ ఉస్మానియకు హస్పిటల్ కు తరలించేలోపే జ్యోతి మృతి చెందింది.

జ్యోతి చేవెళ్ళలోని వివేకానంద కాలేజ్ లో CEC  ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తిచేసుకుంది. సెకండ్ ఇయర్ లో  సీవీక్స్ ఫెయిల్ అవ్వడంతో మనస్థాపం చెందిందని తెలిపారు ఫ్యామిలీ సభ్యులు. తన బిడ్డ చావుకు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమేనని కన్నీరుమున్నీరయ్యారు జ్యోతి తల్లిదండ్రులు. పోస్ట్ మార్టమ్ కోసం డెడ్ బాడీని గాంధీ హస్పిటల్ కు తరలించిన పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Latest Updates