ఎంసెట్ కు అప్లై చేస్తానని వెళ్లి అదృశ్యమైన యువతి

దుండిగల్ , వెలుగు: ఎంసెట్ ఎగ్జామ్ కు  అప్లయ్ చేయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్సై భుపాల్ తెలపిన వివరాల ప్రకారం..ఎండీ ఉస్మాన్ డ్రైవర్ గా పనిచేస్తూ సూరారం కాలనీ భగత్ సింగ్ నగర్ లోభార్యా కూతుళ్లతో కలిసి ఉంటున్నాడు. చిన్న కూతురు నస్రీన్ (19) షాపూర్లోని అబ్దుల్ కలాం కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివింది. ఆదివారం ఉదయం పదిగంటలకు ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు అప్లయ్ చేస్తానని వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. తల్లి దండ్రులు చుట్టుపక్కల, తెలిసిన వారిని, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకి లభించలేదు.తన బామ్మర్ది కొడుకు రియాజ్ మీద అనుమానంగా ఉందని ఉస్మాన్ ఫిర్యాదు చేశాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Latest Updates