విద్యార్థుల చావులకు ప్రభుత్వానిదే బాధ్యత : మురళీధర్ రావు

ఇంటర్ విద్యార్థుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. ఫలితాలకు సంబంధించి ప్రతీ ప్రక్రియలోనూ లోపాలు జరిగాయన్నారు. దోషులను ప్రభుత్వం ఎందుకు కాపాడాలనుకుంటోందని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం నుంచి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాహార దీక్ష చేస్తారని మురళీధర్ రావు చెప్పారు. 23 మంది విద్యార్థులను ప్రభుత్వం బలి తీసుకుందన్నారు సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ. లోపాలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదన్నారు. గ్లోబరీనా వెనక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

Latest Updates