హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

జరమొచ్చినా ఇంటికి పంపలె

కాలేజీలో స్టూడెంట్​ సూసైడ్​

పటాన్ చెరు రూరల్, వెలుగు: కాలేజీలో ఇంటర్ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఏనుకొండ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ పెద్దకూతురు సంధ్యారాణి(16). రామచంద్రాపురం మండలం వెలిమెల శివారులోని ఓ కార్పొరేట్ ​గర్ల్స్​జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ ఫస్ట్​ ఇయర్​ చదువుతోంది. హాస్టల్​లో ఉంటోంది. కొన్ని రోజులుగా జ్వరంతో చదవలేకపోతున్నట్లు గత శనివారం తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. సోమవారం మధ్యాహ్నం మరోసారి ఫోన్ చేసి తనకు బాగా జ్వరం వచ్చిందని, హాస్టల్‌లో ఎవరూ పట్టించుకోవడం లేదని బోరున ఏడువగా కాలేజీకి వస్తానని తండ్రి చెప్పాడు. పరీక్షల సమయమని,  ఇప్పుడు పంపించరని, శనివారం రమ్మని సంధ్య పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బాత్రూంలోకి వెళ్లి గీజర్‌కు తాడుతో ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే నల్లగండ్లలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. సకాలంలో వైద్యం చేయించినట్లైతే తమ కూతురు బతికేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

For More News..

శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

టీఆర్ఎస్ ​కబ్జా చేసిన భూములతో లక్షల ఇండ్లివ్వొచ్చు

ఓయూలో రేపు జాబ్​ మేళా

Latest Updates