హాస్టళ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్

ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలిక.. తాను చదువుతున్న కాలేజీ హాస్టళ్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చత్తీస్‌ఘర్‌లో వెలుగులోకి వచ్చింది. దంతేవాడ జిల్లాలోని పతారాస్ గ్రామానికి చెందిన బాలిక దంతేవాడలోని ఒక పాఠశాలలో ఇంటర్ చదువుతుంది. ఆ బాలిక తన గ్రామానికి చెందిన యువకుడితో సంబంధంలో ఉంది. దాంతో ఆమె గర్భం దాల్చింది. ఆ బాలిక తాను చదువుకుంటున్న కాలేజీకి సంబంధించిన హాస్టళ్లోనే చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన డిప్యూటీ కలెక్టర్ హాస్టల్‌ను సందర్శించి.. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కలెక్టర్ ఈ ఘటన గురించి బాలికను కూడా విచారించారు. తన గ్రామానికి చెందిన యువకుడితో తాను సంబంధంలో ఉన్నట్లు బాలిక ఒప్పుకుందని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. బాలిక జన్మనిచ్చిన మృత శిశువును ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.

For More News..

ఇకనుంచి షాపులు రాత్రుళ్లూ ఓపెన్

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

బీఏకు పెరుగుతున్న డిమాండ్.. ఈ ఏడాది స్టూడెంట్లు 91.98 లక్షలు

Latest Updates