సప్లిమెంటరీ ఫీజు గడువును మరోసారి పెంచిన ఇంటర్ బోర్డు

హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించారు. ఫీజు చెల్లింపునకు ఈనెల 29 వరకు గడువు ముగియనుండగా..విద్యార్థుల తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు మే-2 వరకు  పొడిగించినట్లు ఇంటర్ బోర్డు సోమవారం తెలిపింది. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి మొదట ఈ నెల 27 వరకు గడువు విధించారు. ఆ తర్వాత  29వరకు పొడింగించారు. ఇవాళ మరోసారి పెంచుతూ ఫైనల్ గా మే-2వరకు పొడిగించినట్లు తెలిపారు అధికారులు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉపయోగించుకుని సకాలంలో ఫీజు చెల్లించాలని కోరింది ఇంటర్ బోర్డు.

Latest Updates