మళ్లీ వాయిదా పడిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Inter supplementary exams postponed again

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ నెల 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు  25 తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పుడు మరోసారి వాయిదా వేసి జూన్‌ 7 నుంచి 14 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 15 నుంచి 18 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని తెలిపింది. కాగా సప్లమెంటరీ పరీక్షలు రెండుసార్లు వాయిదా వేయడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates