కాంట్రాక్ట్‌, టెంపరరీ జాబ్స్ కు పెరిగిన డిమాండ్

మారుతున్న జాబ్‌‌ మార్కెట్‌‌  ఇండీడ్‌‌ రిపోర్ట్​

బెంగళూరు: దేశంలో  కాంట్రాక్ట్‌‌ లేదా టెంపరెరీ జాబ్స్‌‌కు ఆసక్తి పెరుగుతోందని జాబ్స్‌‌ సెర్చ్ పోర్టల్‌‌ ఇండీడ్‌‌ పేర్కొంది. ఈ ఏడాది జనవరి–జులై టైమ్‌‌లో కాంట్రాక్ట్‌‌ జాబ్స్‌‌పై జాబ్స్‌‌ సీకర్స్ ఇంట్రెస్ట్‌‌ 150 శాతం పెరిగిందని తెలిపింది. ఈ జాబ్స్‌‌ కోసం చేసే పోస్టింగ్స్‌‌  119 శాతం పెరిగాయని పేర్కొంది.  కరోనా సంక్షోభంతో కాంట్రాక్ట్‌‌ ఉద్యోగాలపై జాబ్‌‌ సీకర్లకు ఆసక్తి పెరుగుతోందని తెలిపింది.  ఇండీడ్‌‌ రిపోర్ట్‌ ప్రకారం  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి కాంట్రాక్ట్‌‌ ఉద్యోగాలకు డిమాండ్‌‌ పెరుగుతూ వస్తోంది. జులైలో  ఈ డిమాండ్‌‌ 110 శాతం పెరగగా, జులై 143 శాతం పెరిగింది. గతేడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో కాంట్రాక్ట్‌‌ జాబ్స్‌‌ కోసం సెర్చింగ్‌‌ మూడు రెట్లు పెరిగిందని ఇండీడ్‌‌ తెలిపింది.   వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోం పద్ధతి పెరగడంతో  ఇన్‌‌స్టలేషన్‌‌ సెగ్మెంట్‌‌లో కాంట్రాక్ట్‌‌ ఉద్యోగులకు డిమాండ్‌‌ ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ పద్ధతిలో ఆఫీస్ ఫెసిలిటీలను ఇంటి దగ్గరే ఏర్పాటు చేయాల్సి ఉండడంతో మెయింటెనెన్స్‌‌ చేసే వాళ్లు, సర్వీస్‌‌ ఇంజినీర్లకు డిమాండ్ ఎక్కువైందని తెలిపింది. ఏడాది ప్రాతిపదికన ఈ డిమాండ్‌‌ 128 శాతం పెరిగిందని పేర్కొంది.  ఇండియన్‌‌ లేబర్‌‌‌‌ మార్కెట్‌‌లో మార్పులొస్తున్నాయని ఇండీడ్‌‌ ఎండీ శశి కుమార్‌‌‌‌ అన్నారు. ఫ్రీలాన్సర్‌‌‌‌, కాంట్రాక్ట్‌‌ జాబ్స్‌‌ వైపు జాబ్‌‌ సీకర్లు చూస్తున్నారని అన్నారు. దీని కోసం పర్మినెంట్‌‌ జాబ్స్‌‌తో వచ్చే బెనిఫిట్స్‌‌ను కూడా వదులుకోవడానికి జాబ్‌‌సీకర్లు రెడీ అవుతున్నారని చెప్పారు. దీనికి బదులు హెల్త్‌‌–వర్క్‌‌–లైఫ్‌‌ను బ్యాలెన్స్‌‌ చేసే జాబ్స్‌‌ను ఎంచుకుంటున్నారని అన్నారు.

జాబ్స్‌‌కు పోటీ పెరుగుతోంది..

దేశంలో హైరింగ్‌‌ యాక్టివిటీ రికవరీ అవుతున్నప్పటికీ జాబ్స్‌‌కు పోటీ కూడా పెరుగుతోందని లింక్‌‌డిన్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్‌‌లో హైరింగ్‌‌ యాక్టివిటీ ఏడాది ప్రాతిపదికన 12 శాతం రికవరీ అయ్యిందని తెలిపింది. కానీ ఈ నెలలోనే జాబ్స్‌‌కు కాంపిటేషన్‌‌ 30 శాతం పెరిగిందని పేర్కొంది. 2019–20 లో ఫాస్టెస్ట్‌‌ గ్రోయింగ్ స్కిల్‌‌గా ఫైథాన్ నిలిచిందని లింక్‌‌డిన్‌‌ తెలిపింది. దీని తర్వాత మెషిన్‌‌ లెర్నింగ్‌‌, డేటా స్ట్రక్చర్‌‌‌‌, డిజిటల్‌‌ మార్కెటింగ్‌‌, హెచ్‌‌టీఎంఎల్‌‌ 5 వంటి స్కిల్స్‌‌ ఉన్నాయని పేర్కొంది.

 

Latest Updates