నా నంబర్ బ్లాక్ చేశారా ?: కేటీఆర్ కు ఉత్తమ్ ప్రశ్న

డిప్యూటీ స్పీకర్ ను ఏకగ్రీవ ఎన్నిక కోసం మద్దతివ్వాల్సిందిగా అసెంబ్లీలోని సీఎల్పీ లాబీలోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లినప్పుడు ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. ముందుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత చాంబర్ లోకి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. వచ్చీరాగానే… ఉత్తమ్ కుమార్ రెడ్డి , KTR ఒకరినొకరు విష్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉత్తమ్ “నా నంబర్ మీరేమైనా బ్లాక్ చేశారా” అని అడిగారు. దానికి మల్లు భట్టి విక్రమార్క పెద్దగా నవ్వారు. అందుకు కేటీఆర్ తన ఫోన్ లోని కాల్స్ ఉత్తమ్ కు చూపిస్తూ( సెల్ తో వీడియో తీయొద్దని జర్నలిస్టులకు సరదాగా కోరుతూ) “నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు. మీకు ఓ మెసేజ్ కూడా పెట్టాను” అన్నారు. “నాకు మిస్డ్ కాల్ వచ్చిన నంబర్ కు కాల్ చేశాను. మీ నంబర్ ను బ్లాక్ చేశారంటూ మెసేజ్ వచ్చింది” అని ఉత్తమ్ అన్నారు. “నేను ఎవరి నంబర్ ను బ్లాక్ చేయను” అని కేటీఆర్ బదులిచ్చారు. ఈ సరదా సంభాషణ అక్కడ కొద్దిసేపు నవ్వులు పూయించింది.

Latest Updates