కేంద్ర మధ్యంతర బడ్జెట్, ఆర్థిక బిల్లులు పాస్

ఢిల్లీ : భారత వైమానిక రంగం-అభివృద్ధి అంశాలపై కాగ్ అందించిన రిపోర్టును కేంద్రప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. రాఫెల్ డీల్ కు సంబంధించి కేంద్రం అవినీతికి పాల్పడిందంటూ పార్లమెంట్ రెండు సభల్లో కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభ, రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే 12 గంటలు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత ప్రారంభమైన రాజ్యసభ 12.30కు వాయిదాపడింది.

12కు ప్రారంభమైన రాజ్యసభ కీలక బిల్లులను ఆమోదించింది. 2019-20 మధ్యంతర బడ్జెట్ ను, ఫైనాన్స్ బిల్లులను చర్చలేకుండానే ఆమోదించింది. ఆ తర్వాత 12.30కు ప్రారంభమైనా కూడా విపక్షాలు ఆందోళన తెలపడంతో రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.

Latest Updates