ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో వెలుగు చూసిన అవకతవకలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఇంటర్ రీవేరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్ కోసం.. గ్లోబరీనాతో పాటు మరో స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే స్వతంత్ర సంస్థ ఎంపిక బాధ్యతను  తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్‌(tsts)కు అప్పగించింది. ఈ రెండు సంస్థలతో సమాంతరంగా ప్రాసెస్ చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Latest Updates