వాయిదా పడిన ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జూన్ 3 నుంచి

లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదాపడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇంటర్‌ జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు.కరోనా పరిస్థితుల వల్ల పరీక్షకు హాజరు కాలేకపోతే మరోసారి అవకాశం ఉంటుందని చెప్పారు. జూలై మూడో వారంలో జరిగే సప్లిమెంటరీ పరీక్ష రాయవచ్చని తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్‌గానే పరిగణిస్తామని ఆయన వెల్లడించారు.

 

Latest Updates