వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్లు శుక్రవారం నుంచి బోర్డు వెబ్ సైట్ tsbie.cgg.gov.in ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా డౌన్ లోడ్
చేసుకున్న హాల్ టికెట్ పై ఎవ్వరి సంతకం లేకున్నా, విద్యార్థులను సెంటర్లలోకి అనుమతించాలని అధికారులకు ఆమె సూచించారు. మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,65,839 మంది స్టూడెంట్లు హాజరవుతున్నారని, 1,339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 25,550 మంది ఇన్విజిలేటర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు.

Latest Updates