క్లాస్‌రూంలోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు

పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా జరగాల్సిన పెళ్లిని ఇద్దరు మైనర్లు బొమ్మలాటగా మార్చేశారు. ఇంటర్ చదువుతున్న ఇద్దరు మైనర్లు ఏకంగా తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజమండ్రిలో వెలుగుచూసింది. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ బాలిక, మైనర్ బాలుడు క్లాస్ రూంనే పెళ్లి మండపంగా మార్చుకున్నారు. క్లాస్ రూంలోనే బాలిక మెడలో మైనర్ బాలుడు మూడు ముళ్లు వేశాడు. ఈ తతంగాన్ని మొత్తం మరో బాలిక వీడియో తీసింది. ఆ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వారిద్దరికీ టీసీ ఇచ్చి పంపించేశాడు. పిల్లలు చేసిన ఈ పనికి వారిద్దరి కుటుంబాలు తలలు పట్టుకున్నాయి.

For More News..

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఒకేసారి రూ. 50 పెంపు

భోపాల్ గ్యాస్ ఘటన నుంచి తప్పించుకున్న 102 మంది కరోనాతో మృతి

మొదలైన రీపోలింగ్.. సిరా చూపుడు వేలుకు పెట్టట్లేరు

Latest Updates