అందాల దీవిలో ఆదినుంచి కల్లోలమే..

శ్రీలంకలో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండ ఆ దేశ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పదేళ్లుగా ప్రశాంత వాతావరణంలో బతుకున్న జనానికి సివిల్ వార్ రోజులను మళ్లీ గుర్తు చేసింది. 2009కి ముందు శ్రీలంకలో సివిల్ వార్ దాదాపు మూడు దశాబ్దాల పాటు నిరాటంకంగా సాగింది. ఆ యుద్ధం చివరి దశలో జరిగిన హింసలోనే సుమారు 40,000మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారంటే మొత్తం మీద ఎంత మంది చనిపోయి ఉంటారో ఊహించుకోవచ్చు. నాలుగు దిక్కులూ నీళ్లే ఉన్న ఈ ద్వీప దేశ చరిత్రలో ప్రజలను కన్నీళ్ల సంద్రంలో ముంచిన వయొలెంట్ ఈవెంట్లు ఇటీవలి కాలంలోనూ కొన్నిఉన్నాయి. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన శ్రీలంక 1948లో తెల్లోళ్ల నుంచి ఇండిపెండెన్స్ పొందింది. తొలుత సిలోన్ అనే పేరు గల ఈ దేశం1972లో రిపబ్లిక్ కంట్రీగా అవతరించింది. అయితే దేశంలోని వివిధ జాతుల, తెగల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ గణతంత్ర ఆనందం అక్కడి ప్రజలకుఎక్కువ రోజులు నిలవలేదు.

ఆసియా ఖండంలోని ఇండియా, చైనా వంటి రెండు బలమైన ప్రాంతీయ దేశాల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న ఆధిపత్య పోరులో శ్రీలంక చిక్కుకుపోయింది. ఆ దేశ జనాభా 2.2 కోట్లు. ఇందులో 70శాతం మందికిపైగా బౌద్ధులే. మిగతా 30 శాతంమందిలో దాదాపు అన్ని మతాల వాళ్లు ఉన్నారు. హిందువులు 12 శాతం, ముస్లింలు సుమారు 10శాతం, క్యాథలిక్కులు 6 శాతం మంది ఉంటారు. ఆదివారం జరిగిన నరమేధానికి మూడు చర్చిల్ లోప్రార్థనలకు హాజరైన క్రైస్తవులు బలయ్యారు.

మైనారిటీలను భయపెడుతున్న బౌద్ధులు
శ్రీలంకలో సింహాళీ బౌద్ధులు అధిక సంఖ్యలోఉన్నా అల్ప సంఖ్యాక వర్గాలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలను భయపెడుతున్నారు. వాళ్ల జనాభా, ప్రభావం పెరుగుతుండటమే దీనికి కారణం. 1980ల్లోనూ ఇలాంటి వాతావరణమే నెలకొంది. సింహాళీ బౌద్ధులు.. హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్న మైనారిటీ తమిళ గ్రూపులను అణచివేయాలని ప్రయత్నించారు. అదే.. 30 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధానికి బీజం వేసింది. తమకి తాము సెక్యులర్ గా భావించి ఆయుధాలను చేతబట్టిన తమిళ టైగర్లు తిరుగుబాటు సమూహంగా ఏర్పడి ఘోరమైన దాడులకు తెరతీశారు. బాంబులను ధరించి ఆత్మహుతి దళాలుగా అవతారమెత్తారు. దీనికి స్పందనగా శ్రీలంక ఆర్మీ క్రూరమైన ప్రచారం చేపట్టి, తమిళ టైగర్లకు పట్టున్న ఈశాన్య ప్రాంతంపై దృష్టి పెట్టింది. దీంతో ఇరువర్గాలు పైచేయి సాధించేందుకు పాకులాడాయి. ఫలితంగా హింసాత్మక సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఎలా ఉందో అప్పట్లో శ్రీలంక అలా ఉండేది. సింహాళీస్ బుద్ధిస్ట్​ నేషనలిజం భావన బలపడుతుండటంతో ప్రజలు మళ్లీ వర్గాలుగా చీలిపోతున్నారు. దీంతో దేశంలో హింస కొత్తదారులు వెతుకుతోంది. మెజారిటీ సింహాళీ పొలిటీషియన్లలో అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బౌద్ధ మూకలు ముస్లిం మైనారిటీల వ్యాపార సంస్థలపైన, ఇళ్లపైన దాడులు చేయటంతో అధికారులు గతేడాది క్యాండీ జిల్లాలో ఎమర్జెన్సీ విధించారు.

2018లో రాజ్యాంగ సంక్షోభం
శ్రీలంకలో పోయినేడాది అక్టోబర్ లో తలెత్తిన రాజ్యాంగ సంక్షోభం రెండు నెలలకు గానీ సమసిపోలేదు. ఒకే టైం లో ఇద్దరు నేతలు తమకు తాముప్రధానులుగా ప్రకటించుకున్నారు. ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన.. పీఎం రణిల్ విక్రమ సింఘేపై ఫైర్ అయ్యారు. ఆయనకు బదులు మాజీ ప్రెసిడెంట్ మహిందా రాజపక్సను ప్రధానిగా నియమించారు.

Latest Updates