HCU స్టూడెంట్ కు..ఇంటర్నేషనల్ అవార్డు

హైదరాబాద్‍ సెంట్రల్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్‍ ఉమేష్ సింగ్ కు టాటా ట్రస్ట్ స్టూడెంట్స్ బియెన్నల్ – 2018 ఇంటర్నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నాడు. కేరళలోని కొచ్చిలో నిర్వహించిన కొచ్చి–ముజురీస్‍ బియెన్నల్‍–2018 ప్రోగ్రామ్ లో ఈ అవార్డును అందుకున్నాడు. ‘అన్‍కంపోర్టబుల్ టూల్స్, జాబ్‍’ విభాగంలో చేసిన కృషికి జ్యూరీ బృందం ఈ అవార్డుకు ఎంపి క చేసింది. బీహార్‍ సాంప్రదాయ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు, రైతులు వ్యవసాయంలో,గింజలను వేరుచేసే ప్రక్రియలో ఉపయోగించే సహజంగా వాడే పనిముట్ల ఇతివృత్తంగా తీసిన ఫోటోగ్రాఫ్స్ అతని ఎంపికలో కీలక పాత్ర పోషించాయి. దేశ వ్యా ప్తంగా 50 ఫైన్ ఆర్ట్స్ కాలేజీలకు చెందిన 250 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్క్ దేశాలకు చెం దిన 27 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

 

Latest Updates