సిరిసిల్లలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్

త్వరలో ఓపెన్ చేస్తామన్న మంత్రి అజయ్ కుమార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అతి త్వరలో సిరిసిల్లలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అందుబాటులోకి రానుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 32వ జాతీయ రోడ్డు భద్రత మాసంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ట్రాన్స్ పోర్ట్​ ఆఫీస్​లో రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌, స్టిక్కర్స్, ట్రాఫిక్​ రూల్స్ పాంప్లేంట్ రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్​ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించవచ్చు అన్నారు. ఫిబ్రవరి 17 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓవర్ స్పీడ్, డ్రంకెన్​ డ్రైవ్ వల్లనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర రవాణాశాఖ చరిత్రలో తొలి సారిగా భారీ స్థాయిలో ఏఎంవీఐలకు ఎంవీఐలుగా ప్రమోషన్లు కల్పించడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ పాపారావు అధ్యక్షతన జరిగిన ప్రోగ్రామ్​లో ఆ సంఘం డైరీ, క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను ఆయన రిలీజ్ చేశారు.

Latest Updates