భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదాభారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) వాయిదా పడింది. నవంబర్‌ 20 నుంచి 28 మధ్య గోవాలోజరగాల్సిన 51వ చిత్రోత్సవాలను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌ తెలిపారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో చర్చించిన తర్వాత ఈ ప్రకటన జారీ చేసినట్టు చెప్పారు. కరోనాతో నెలకొన్న పరిస్థితుల క్రమంలో సమాచార, ప్రసారాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 జనవరి 16 నుంచి 24 తేదీల్లో గోవాలో అన్ని మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించాలని కలిసి నిర్ణయించినట్టు జావడేకర్‌ తెలిపారు. ఈసారి హైబ్రిడ్‌ పద్ధతి (వర్చువల్‌, ఫిజికల్‌)లో నిర్వహించనున్నట్టు చెప్పారు.

Latest Updates