తెలంగాణ సోనాతో ఇంటర్నేషనల్ ఇమేజ్

హైదరాబాద్‌, వెలుగు : తెలంగాణ సోనాతో రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఇమేజ్ వస్తుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరయా్ణ లతో తెలంగాణ వ్యవసాయ రంగంలో మిగులు రాష్ట్రంగా మారిందన్నా రు. తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు బ్రాండ్‌ కల్పించేం దుకు రాష్ట్రప్రభుత్వం, వ్య వసాయ యూనివర్సిటీ, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్ బీ)ల మధ్య శుక్రవారం వర్చువల్ విధానంలో ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం వల్ల సెప్టెంబర్‌ వరకు ఫలితాలు వస్తాయని జనార్దన్  రెడ్డి తెలిపారు. కిందటేడాది కంటే ఈసారి తెలంగాణ సోనా సాగు పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్, ఐఎస్‌బీ ఈడీ ప్రొఫెసర్‌ శేషాద్రి తది తరులు పాల్గొన్నా రు.

Latest Updates