
కోవిడ్ కారణంగా ఈసారి బ్రేక్
హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా కైట్ ఫెస్టివల్ క్యాన్సిల్ అయింది. 2016 నుంచి తెలంగాణ టూరిజం శాఖ నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు ఎంతో సందడిగా జరిగేది. ఇంటర్నేషనల్, నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఎగరేసే డిఫరెంట్కైట్స్తో పాటు విన్యాసాలు చూసేందుకు, వివిధ రాష్ట్రాలకు చెందిన నోరూరించే పిండి వంటలను తినేందుకు సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు వచ్చేవారు. ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కైట్ ఫ్లయర్స్ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలున్నాయి. జనాలు గుంపులుగా ఉంటే వైరస్ త్వరగా స్ప్రెడ్అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కోవిడ్ రూల్స్వల్ల ఎక్కువ గ్యాదెరింగ్ లేకపోవడంతో కైట్ ఫెస్టివల్ నిర్వహించడంలేదని టీఎస్టీడీసీ ఎండీ మనోహర్ తెలిపారు.