ఉపాధికి దెబ్బ : 30కోట్ల‌ జాబ్స్ పోతయ్

అసంఘటిత రంగంలో 160 కోట్ల మంది ఉపాధికి దెబ్బ: ILO

జెనీవా: కరోనా ప్రభావం వల్ల ఈ ఆర్థికర్థి సంవత్సరం రెండో క్వార్ట‌ర్ లోనే 30 కోట్ల ఫుల్ టైం జాబ్స్ పోతయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గ‌నైజేష‌న్ (ILO) తాజాగా అంచనా వేసింది. లాక్డౌన్ ను పొడిగించడంతో ILO  తన అంచనాలను సవరించింది. గతంలో 19.5 కోట్ల ఉద్యోగాలు పోతయని పేర్కొంది. వారానికి 48 గంటల పనిని బేస్ గా తీసుకుని ఈ అంచనా వేసినట్లు తెలిపింది.లాక్ డౌన్ కారణంగా కంపెనీలు ఎన్ని పని గంటలు కోల్పోతున్నాయి, ఎంత మంది కార్మికులు, ఉద్యోగులపై ప్రభావం పడనుందని లెక్కలు కనిపెట్టినట్లు పేర్కొంది.

మరో వైపు, అసంఘటిత రంగంలోని 160 కోట్ల మంది కార్మికుల ఉపాధి కూడా డేంజర్లో పడిందని ILO ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్ లో ఇది సగమని, వీళ్లు జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉందని తన రిపోర్టులో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 43.6 కోట్ల చిన్నాపెద్ద కంపెనీలు కుప్పకూలే ప్రమాదంలో ఉన్నాయని ILO రిపోర్టు వెల్లడించింది. ఆర్థిక మాంద్యం ప్రభావం వీటిపై చాలా ఎక్కువని, ఇందులో 23.2 కోట్ల హోల్ సేల్, 11.1 కోట్ల రిటైల్ పరిశ్రమలు ఉన్నాయని పేర్కొంది. వీటికి తోడు 5 కోట్ల ఫుడ్ స‌ర్వీస్ కంపెనీల పైనా, 4 కోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీల పైనా కరోనా ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేసింది.

ఆర్థిక మాంద్యం కన్నా ఎక్కువే

2008 ఆర్థిక మాంద్యం కన్నా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడుతుందని, ఇప్పట్లో తేరుకోవడం కష్టమని వరల్డ్ బ్యాంక్ అధికారి ఇటీవలే హెచ్చరించారు.

Latest Updates