మహిళా దినోత్సవం స్పెషల్: ఈ టూరిస్టు ప్రదేశాల్లో మహిళలకు ఫ్రీ ఎంట్రీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మహిళలకు ఓ చిన్న కానుక ఆఫర్ చేసింది. తమ శాఖ తరఫున దేశంలోని అన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు మహిళలకు ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఏఎస్ఐ పరిధిలోని మాన్యుమెంట్స్ ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఒక్క రోజు భారతీయ మహిళలతో పాటు విదేశీ స్త్రీలు కూడా టికెట్ కొనాల్సిన అవసరం లేదన్నారు. ఈ రోజు మహిళల గౌరవార్థం ఓ చిరు కానుకగా ఈ ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు చెప్పారాయన.

ఏఎస్ఐ టూరిస్టు స్పాట్లు

హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ, సెవన్ టూంబ్స్, సాలార్జంగ్ మ్యూజియం లాంటి టూరిస్టు ప్లేసులు ఏఎస్ఐ పర్యవేక్షణలోనే ఉన్నాయి. అలాగే కర్ణాటకలోని టిప్పు సుల్తాన్ కోట, చిత్రదుర్గ కోట, ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని కుతుబ్‌మినార్, ఎర్రకోట లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఏఎస్ఐ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటినీ మహిళలు ఈ రోజు ఉచితంగా సందర్శించవచ్చు.

Latest Updates