ఇంటర్నెట్ లో భారీగా పెరుగుతున్న లోకల్ లాంగ్వేజీ యూజర్ల సంఖ్య

యూజర్లలో పెరుగుతున్న ఆసక్తి

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ను లోకల్ లాంగ్వేజ్‌ లో యూజ్‌ చేయడంపై ఇండియన్లకు ఆసక్తి పెరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ఇంటర్నెట్‌ యూజర్లు నేటివ్‌‌ లాంగ్వేజ్‌ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఓ రిపోర్ట్ పేర్కొంది. డిజిటల్‌ మార్కెటిం గ్‌ ఏజెన్సీ వాట్‌ కన్సల్ట్‌‌కు చెందిన రెకగ్న్‌‌ ఈ రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. ఇంటర్నెట్‌ సర్ఫింగ్‌ లో కంఫర్ట్‌‌ ఉండడంతో నేటివ్‌‌ లాం గ్వేజ్‌ లకే యూజర్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ రిపోర్ట్‌‌ చెప్పింది. ‘డిజిటల్‌  డైవర్స్‌‌ అండ్‌ మల్టీ లింగ్వల్‌ ఇండియా’ పేరుతో ఈ రిపోర్ట్‌‌ను కంపెనీ రిలీజ్ చేసింది. అన్ని రకాల ఏజ్ గ్రూప్‌ లు, వృత్తులు, జెండర్లు, టౌన్‌ లకు చెందిన 1,474 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ సర్వేను ఈ ఏడాది ఏప్రిల్‌ –జూన్‌ మధ్య జరిపామని కంపెనీ చెప్పింది. ఇండస్ట్రీ స్టేక్‌ హోల్డర్ల ఇంటర్ వ్యూ లను కూడా ఈ సర్వే పరిగణనలోకి తీసుకొంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో గరిష్టం గా(403 మంది) 55 ఏళ్లకు పైనున్నవారని ఈ రిపోర్ట్‌‌ పేర్కొంది. హైదరాబా ద్‌ , ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌ వంటి సిటీలకు చెందిన వారు ఇందులో ఉన్నారని తెలిపింది. టెక్నాలజీ, గ్యాడ్జెట్స్‌‌, ఫ్యాషన్‌ , స్పోర్ట్స్‌ కు చెందిన వీడియో కంటెంట్లను ఇంగ్లిష్‌లో చూడడానికి ఇండియన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఈ రిపోర్ట్‌‌ పేర్కొంది. ఫుడ్‌, ఎంటర్‌టైన్‌ మెంట్‌, ఎడ్యుకేషన్‌ లకు చెందిన ప్రోగ్రామ్‌ లను లోకల్‌ లాంగ్వేజ్‌ లలో చూడడానికి ఇష్టపడుతున్నారని చెప్పింది. దేశంలో మొబైల్‌ బ్రాడ్‌ బాండ్‌ వాడుతున్న పాపులేషన్‌ సుమారు 67 .61 కోట్లుగా ఉంటుందని అంచనా.

Latest Updates