నిత్యానంద ఆచూకీ తెలిస్తే చెప్పండి.. నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్

Interpol issues Blue Corner notice to locate godman Nithyananda

అత్యాచార కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందకు ఇంటర్‌పోల్ అధికారులు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. దేశం విడిచి పరారీలో ఉన్న  నిత్యానంద ఆచూకీ తెలుసుకోవాలని ప్రపంచదేశాలను కోరింది. అతన్ని అరెస్టు చేయడానికి సహకరించాలంటూ గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన విజ్ఙప్తిపై స్పందించిన ఇంటర్‌పోల్ ఈ నోటీసు జారీ చేసింది. అహ్మదాబాద్ నగర డిప్యూటీ కమిషనర్ కేటీ కమారియా ఈ విషయాన్ని మీడియాకి తెలిపారు.

అహ్మదాబాద్‌లో నిత్యానందకు చెందిన యోగిణి సర్వజ్ఙపీఠంలో ఇద్దరు బాలికలను నిర్భందించి, వారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడని నిత్యానందపై కేసు నమోదైంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకునిత్యానంద గత ఏడాది దేశం విడిచి పారిపోయాడు. అతని ఆచూకీ కోసం తెలుసుకునేందుకు గుజరాత్ పోలీసులు ఇంటర్ పోల్ ని ఆశ్రయించగా.. ఇంటర్‌పోల్ నిత్యానందపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. చట్టాలను ఉల్లంఘించి, పరారీలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నదీ గుర్తించడానికి బ్లూ కార్నర్ నోటీసు ను జారీ చేస్తారు.

Interpol issues Blue Corner notice to locate godman Nithyananda

Latest Updates