మొబైల్ యాప్స్ తో డబ్బు కొట్టేస్తున్నరు

హైదరాబాద్,వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు మొబైల్ యాప్స్ అడ్డాగా  క్విక్కర్, ఓఎల్ఎక్స్ఈ కామర్స్ వెబ్ సైట్లలో  యాడ్స్ ఇస్తూ అమాయకుల దగ్గర డబ్బు కొట్టేస్తున్నాయి.  ఆర్థిక లావాదేవీలను సులువుగా  జరిపేందుకు ‘గూగుల్ పే’ యాప్స్ తో సైబర్ దొంగలు మనీ ట్రాన్స్ ఫర్ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నారు.  ఇందులో రాజస్థాన్‌ భరత్‌పూర్‌ కు చెందిన దొంగల ముఠా ఆర్మీ, మిలిటరీ అధికారుల పేర్లతో మోసాలు చేస్తోంది. ‘గూగుల్ పే’ యాప్ నే మనీ ట్రాన్స్ ఫర్ కి అడ్డాగా చేసుకుంది. తమ ట్రాప్ లో చిక్కిన అమాయకుల నుంచి కొరియర్ ఛార్జీలు, ఎయిర్ పోర్ట్ లో ‘నో అబ్జెక్షన్’,వెహికల్ రిలీజ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, కస్టమ్స్ స్టాంప్ లాంటి కండిషన్స్ తో రూ.లక్షలు దోచేస్తున్నారు . తాము టార్గెట్ చేసిన వారి నుంచి డబ్బు కొట్టేసి గూగుల్ పే అకౌంట్స్ తో ఉన్న సిమ్ కార్డులను బ్రేక్ చేస్తున్నారు.

యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని

సైబర్ క్రైమ్ పోలీసుల కేస్ స్టడీ ప్రకారం ఆర్మీ అధికారులమని చెప్పి రాజస్థాన్ భరత్ పూర్ గ్యాంగ్ ఈ కామర్స్ సైట్లలో యాడ్స్ ఇచ్చి మోసాలకు పాల్పడుతోంది. వెహికల్ సెకండ్ సేల్ పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు,బిల్స్ తో అమాయకులను ట్రాప్ చేస్తోంది. ఫేక్ అడ్రెస్ తో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ తో లింకైన ‘గూగుల్ పే’ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయించుకుంటోంది. ఈ భరత్ పూర్ గ్యాంగ్ సభ్యులు తమను నమ్మిన  కస్టమర్లకు గూగుల్ పే నుంచి మనీ ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్తారు. తమ ట్రాప్ లో చిక్కిన వారి మొబైల్ లో ఆ యాప్ లేకపోయినా ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచిస్తారు. ఇలాంటి నేరాల్లో రాజస్థాన్ భరత్‌పూర్‌ దొంగలు పక్కా స్కెచ్ వేసి ఆన్ లైన్ లో దోచేస్తున్నారు. ఏజెంట్లతో సేకరించిన ఆధార్ కార్డులతో  తాము నేరం చేసే ప్రాంతం కాకుండా మరో ఏరియాలో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. తమది కానీ ఐడీ ప్రూఫ్ తో ఇల్లీగల్ గా సిమ్ కార్డులు కొని బ్యాంక్ అకౌంట్స్ కి లింక్ చేస్తున్నారు.

ఈ నంబర్లను గూగుల్ పే లాంటి యాప్స్ కి కనెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు తమ టవర్ లొకేషన్ ఫోన్‌ సిగ్నల్స్‌ ను  పోలీసులు గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ అకౌంట్స్ కి మనీ ట్రాన్స్ ఫర్ అవ్వగానే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటీంఎంల ద్వారా డబ్బులను విత్ డ్రా చేస్తున్నారు. తమ టార్గెట్ పూర్తయ్యాక సిమ్ కార్డులను బ్రేక్ చేసి పడేస్తున్నారు.  ఒక్కోసారి బాధితుల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్న నేరస్థులు.. మళ్లీ ఓ రోజు తర్వాత అదే మొబైల్ నంబర్ ను వాడుతారు. దీనికి కారణం మళ్లీ ఎవరైనా వెహికల్ కావాలంటూ ఫోన్ చేస్తే కొత్తగా మోసం చేసేందుకు స్కెచ్ వేస్తారు. తమ చేతుల్లో మోసపోయిన బాధితుల నంబర్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. ఇలా ఈ కామర్స్ లో వెబ్ సైట్లలో తాము అమ్మకానికి పెట్టిన వెహికల్స్ ఫేక్ యాడ్స్ ను వెబ్ సైట్ నిర్వాహకులు బ్లాక్ చేసేంత వరకు తమ మొబైల్ ఫోన్లను మార్చుతూ భరత్ పూర్ గ్యాంగ్ సభ్యులు మోసాలు చేస్తున్నారు. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయే కొందరు బాధితులు కొరియర్ ఛార్జీలు చెల్లించిన తరువాత అనుమానం వస్తే జాగ్రత్త పడుతున్నారు.  మరికొంత బాధితులు కనీసం పోలీసులకు కూడా కంప్లయింట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

భరత్ పూర్ గ్యాంగ్ ఆర్మీ అధికారుల పేరుతో ఓల్ఎక్స్, క్వికర్ లాంటి ఈ కామర్స్ సైట్లలో మోసాలు చేస్తున్నట్టు  సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఈ కామర్స్ వెబ్ సైట్లలో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సైబర్ దొంగలు మాయమాటలతో నమ్మించి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ తో ఈజీగా మనీ కొట్టేస్తున్నట్టు కేస్ స్టడీస్ లో తేలిందన్నారు. ఈ కేసుల్లో ఫేక్ ఐడీ ఫ్రూఫ్ లతో అకౌంట్లు ఓపెన్ చేసి..మోసం చేసిన తర్వాత సిమ్ కార్డులు బ్రేక్ చేస్తుండటంతో టవర్ లోకేషన్, బ్యాంకు డీటెయిల్స్ గుర్తించినా..వారు దొరకడం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు.

 

Latest Updates