ఇలాగే ఉండాలనుకున్నా!

సమంత. సౌత్‌‌‌‌ సినిమాల్లో స్టార్‌‌‌‌ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో మొదటి సినిమా ‘ఏ మాయ చేశావో’తోనే తనకంటూ ఒక స్టైల్‌ ను , ఒక సెపరేట్‌‌‌‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌‌‌‌ను తెచ్చిపెట్టుకున్న ఈ స్టార్‌‌‌‌, అక్కినేని ఫ్యామిలీ మెం బర్‌‌‌‌ కూడా! పదేళ్లయిం ది సమంత సినిమాల్లోకి వచ్చి. ఈ పదేళ్లలో తెలుగు సినిమా చాలా మారిం ది. అలాగే సమంత కెరీర్‌‌‌‌, జీవితం కూడా! సోషల్‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ సైట్‌‌‌‌ ట్విటర్‌‌‌‌లో సమంతకు 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎవరైనా సమంతను ‘ఒక రిప్లయ్‌ ఇవ్వొచ్చుగా?’ అనడిగితే, టైమ్‌‌‌‌ చూస్కొని కచ్చితంగా రిప్లయ్‌ ఇస్తుంది. అప్పుడప్పుడు ‘ఆస్క్‌‌‌‌ సమంత’ పేరుతో చాట్‌‌‌‌ సెషన్‌ నిర్వహిస్తుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు ట్విటర్‌‌‌‌లోనే రిప్లయ్‌ ఇస్తుంది. సమంత చాట్‌‌‌‌ సెషన్‌ పెట్టిం దంటే అభిమానులకు పండుగే. ఆమె ‘ఆస్క్‌‌‌‌ సమంత’ పేరుతో పెట్టిన సెషన్‌ లో నెటిజన్లు అడిగిన

కొన్ని ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఇవి.

 

మీ గురించి మీరు ఎలా ఫీలవుతారో ఒక్క పదంలో చెప్పండి.
ఒక్క పదంలో చెప్పడమంటే కష్టం . కాకపోతే ఒక వాక్యం లో చెబుతా. ‘నేనిలా ఉన్నా నంటే, ఇలాగే ఉండాలని కోరుకున్నా కాబట్టి’.

ఈ లక్షణం మార్చుకోవాలని అని ఎప్పుడైనా అనిపించిందా?
మూడీగా ఉంటా కొన్నిసార్లు. అది మార్చుకోవాలి.

ఇన్ని సినిమాలు చేశారు కదా? ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా?
ఏ మాయ చేశావే.

బాగా భయపెట్టే విషయం ఏదైనా ఉందా?
నేను ఏ పరిస్థితుల నుంచి వచ్చానో, అక్కడికి తిరిగి వెళ్లిపోతానేమో అన్న భయం ఉంటుంది.

ఏదైనా బాధ వస్తే ఏం చేస్తారు?
ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా.

ఇండస్ట్రీలో మీకు పోటీ ఇచ్చే హీరోయిన్‌ ఎవరనుకుంటా రు? ఆ పోటీని ఎలా చూస్తారు?
కాంపి టీషన్‌ ఉంటే బాగుంటుంది. వాళ్లు ఉంటే ఇంకా బాగా పనిచేస్తా. ఆ పోటీ ఎవరితో అంటారా? పేర్లు మారుతూ ఉంటాయి.

మీ సక్సెస్‌‌‌‌కు కారణం? ఆ సీక్రెట్‌‌‌‌ ఏంటో చెప్పం డి.
సీక్రెట్‌ ఏం లేదు. కష్టపడటం అంతే.

సమంతగా బతకడంలో ఉన్న గొప్ప సంతోషం?
సమంత చుట్టూ ఆమెను ప్రేమించే అభిమానులు ఉన్నా రు.

ఒక మూడు విషయాలు చెప్పం డి. అవి లేకుంటే మీరు బతకలేరు అనిపించేవి.
చై(నాగచైతన్య), మస్కటీ ఐస్‌‌‌‌క్రీమ్‌,  పని.

ఏఎన్‌ ఆర్‌‌‌‌ మనవరాలు, నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య.. వీటిల్లో ఎలా పిలిస్తే మీకిష్టం .
నా భర్తకు భార్యగా.

చై.. చై.. చై..!
సమంత ట్విటర్‌‌‌‌లో చాట్‌‌ సెషన్‌ పెట్టినప్పుడల్లా ఎవరో ఒకరు నాగచైతన్య గురించి అడుగుతుంటారు. ‘తను కేవలం భర్త కాదు. బెస్ట్‌ ఫ్రెండ్‌ . లఫ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటుంది సమంత. నాగచైతన్యను అభిమానులు చైతూ అని పిలుచుకుంటారు. సమంత ‘చై’ అంటుంది. ఈ ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో.. నాగచైతన్య గురించి అడిగే ప్రశ్నలకు సమంత సమాధానాలివ్వడం అంత బాగుంటుంది.

Latest Updates