సార్ వద్దు బ్రదర్ అని పిలవండి..పవన్ కు కేటీఆర్ విజ్ఞప్తి

కరోనా వైరస్  తో దేశం మొత్తం లాక్ డౌన్ కావడంతో చాలా మంది ప్రముఖులు  ప్రభుత్వాలకు తమవంతు ఆర్థిక సాయం చేస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు రూ.కోటి చొప్పును  ట్విట్టర్లో ప్రకటించారు.  అయితే గొప్ప మెసేజ్ ఇచ్చారన్నా అని  పవన్ కు  రిప్లై ఇచ్చారు కేటీఆర్.

కరోనా లాంటి విపత్తు సమయాల్లో కేసీఆర్ నాయకత్వంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ  కేటీఆర్ ను ఉద్దేశించి సర్ అని ట్విట్టర్లో బదులిచ్చారు పవన్. అయితే తనను సర్ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఎప్పటిలాగే తనను బ్రదర్ అని పిలవాలని కోరారు కేటీఆర్. దీనికి  పవన్..ఒకే బ్రదర్ రిప్లై ఇచ్చారు.

Latest Updates