ఓయు గర్ల్స్ హాస్టల్ లోకి దూరిన వ్యక్తి అరెస్ట్

ఓయూ గర్ల్స్ హాస్టల్ లో.. ఈ  నెల 15 అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన ఆగంతకుడు పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. సెల్ ఫోన్స్ కోసమే గర్ల్స్ హాస్టల్ లోకి వచ్చానని చెబుతున్నాడు ఆ ఆగంతకుడు. నాలుగు రోజుల క్రితం ఓయూ గర్ల్స్ హాస్టల్ వెనుకవైపు నుంచి ప్రవేశించాడు. ఓ మహిళను పట్టుకోడానికి ప్రయత్నించడంతో ఆమె కేకలు పెట్టింది. దీంతో ఆగంతకుడు పారిపోయాడు. ఈ ఘటనకు నిరసనగా విద్యార్ధి సంఘాలు ఆందోళన కూడా చేశాయి.

Latest Updates