పెట్టుబడులకు… ఇండియా స్వర్గమే!

investments-top-india-world-wide-countries

న్యూఢిల్లీ : మనీ పెట్టుబడి పెట్టడానికి ‘సింగిల్ బెస్ట్ ప్లేస్’ ఇండియానే అని ఇన్వెస్టర్ ప్రేమ్ వత్స అన్నారు. ఇండియా మార్కెట్ ప్రస్తుతం బులిష్ ట్రెండ్‌‌‌‌లో కొనసాగుతోందని, ప్రధాని మోడీ నేతృత్వంలో ఎకానమీలో ప్రైవేటైజేషన్ పెరిగిందని ప్రేమ్ తెలిపారు. గ్లోబల్‌‌‌‌గా ట్రేడ్‌‌‌‌ టెన్షన్లు నెమ్మదిస్తాయని ప్రేమ్ అభిప్రాయపడ్డారు. ‘చైనాతో, యూరప్‌‌‌‌తో ట్రేడ్ సమస్యలున్నాయి. వాటిని వారు పరిష్కరించుకుంటారు. చైనాకు అమెరికా కావాలి. అమెరికాకు, ప్రపంచానికి చైనా కావాలి. ఈ రెండు దేశాలు కూడా వారి మ్యూచువల్ అడ్వాన్‌‌‌‌టేజ్ కోసం పనిచేస్తాయి’ అని తెలిపారు ప్రేమ్.

ప్రేమ్ కెనడియన్ ఇన్సూరర్‌‌‌‌‌‌‌‌, హోల్డింగ్ కంపెనీ ఫైర్‌‌‌‌‌‌‌‌ఫ్యాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌కు సీఈవో. ఇండియాలో రెండోసారి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే గెలవడంతో పెట్టుబడులు పెట్టడానికి ఇండియా బెస్ట్ ప్లేస్‌‌‌‌గా అభివర్ణించారు. ‘తొలిసారి నరేంద్ర మోడీ గెలిచినప్పుడే మేము ఫైర్‌‌‌‌‌‌‌‌ఫ్యాక్స్‌‌‌‌ ఇండియాను ఏర్పాటు చేశాం. వచ్చే ఐదేళ్లు ట్రాన్స్‌‌‌‌ఫర్మేటివ్‌‌‌‌గా సాగుతుందని మేము భావిస్తున్నాం. ఫైర్‌‌‌‌‌‌‌‌ఫ్యాక్స్ ఇండియాలో పెట్టుబడులు కొనసాగిస్తాం. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి మాకు చాలా మార్గాలున్నాయి.

భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సింగిల్ బెస్ట్ ప్లేస్‌‌‌‌గా మేము భావిస్తున్నాం’ అని ప్రేమ్ చెప్పారు. ప్రేమ్ కంపెనీలు ఇండియాలో రూ.25,700 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. దీనిలో కేథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్ కూడా ఉంది. స్థానిక లెండర్‌‌‌‌‌‌‌‌లో మెజార్టీ వాటాలను పొందేందుకు తొలిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఈ బ్యాంక్‌‌‌‌ స్టాక్ మార్కెట్‌‌‌‌లో లిస్ట్ అయ్యేందుకు చూస్తోంది. ఈ ఏడాది ముగిసే వరకే ఐపీఓకు రావాలని ప్రభుత్వం చెప్పిందని, కానీ మరో ఆరు నెలల పాటు సమయం కావాలని కోరినట్టు ప్రేమ్ వత్స చెప్పారు.

అమెరికాపై కూడా ప్రేమ్ వత్స బులిష్‌‌‌‌గానే ఉన్నారు. అమెరికా తర్వాత గ్రీస్‌‌‌‌పై కూడా ప్రేమ్ ఆసక్తి చూపుతున్నారు. గ్రీస్‌‌‌‌లో ఫైర్‌‌‌‌‌‌‌‌ఫ్యాక్స్‌‌‌‌కు యూరోబ్యాంక్‌‌‌‌ ఎర్గాసియాస్‌‌‌‌ ఎస్‌‌‌‌ఏలో అత్యధిక వాటాలున్నాయి. కెనడాలో బ్లాక్‌‌‌‌బెర్రీ లిమిటెడ్‌‌‌‌లో, స్టీల్‌‌‌‌మేకర్‌‌‌‌‌‌‌‌ స్టెల్కో హోల్డింగ్స్ ఇంక్‌‌‌‌లో ఫైర్‌‌‌‌‌‌‌‌ఫ్యాక్స్‌‌‌‌కు వాటాలున్నాయి. ఈ రెండు కంపెనీలపై కూడా ప్రేమ్‌‌‌‌ వత్సకు విశ్వాసం ఉంది.

Latest Updates