గుట్టుగా వాట్సాప్​ వాడుకోండి

invisible-feature-in-whatsapp

వాట్సాప్​ వాడుతున్నప్పుడు ఇతరులకు తెలియకుండా ఉండటం సాధ్యం కాదు. వాట్సాప్​ యాప్​ ఓపెన్​ చేయగానే వేరే యూజర్లకు ‘ఆన్​లైన్’​అని కనిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఒక మెసేజ్​ పంపినప్పుడు వాటిని ఎప్పుడు చూశామో తెలియకుండా ఉండాలంటే బ్లూటిక్స్​ ఆఫ్​ చేసుకోవచ్చు. కానీ, తిరిగి ఆన్​లైన్​లోకి రాగానే ఆ విషయం తెలిసిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వాట్సాప్​కు కొంతకాలం దూరంగా ఉండాలన్నా కొంచెం చిక్కే. ఫేస్​బుక్, ట్విట్టర్​లాగా వాట్సాప్​ను డిలీట్​ చేయడం, తిరిగి ఇన్​స్టాల్​ చేయడం అంత ఈజీ కాదు. ఎప్పుడూ డాటా రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. మరైతే ఈ ఇబ్బందికి పరిష్కారం ఏంటి? అదే ‘వాట్సాప్​ ఇన్​విజిబుల్’.

ఇది కొత్త ఫీచర్​ కాదు. ఎందుకంటే వాట్సాప్​లో ‘ఇన్​విజిబుల్’ అనే ఫీచరేమీ లేదు. అయితే వాట్సాప్​ వాడుతున్నా, ఆ విషయం ఇతరులకు తెలియకుండా ఉండటం, లేదా వాట్సాప్​ నోటిఫికేషన్స్​కు దూరంగా ఉండేలా సెట్టింగ్స్​ను మార్చుకోవడమే ‘వాట్సాప్​ ఇన్​విజిబుల్’. దీనివల్ల యూజర్లు వాట్సాప్​ వాడుతున్నా మీ యాక్టివిటీ ఇతరులకు తెలియకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రతిసారి వచ్చే నోటిఫికేషన్స్​వల్ల ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మీ వాట్సాప్​ యాక్టివిటీని ఇన్​విజిబుల్​గా మార్చుకోవచ్చు.

వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చిన తర్వాత ఎరోప్లేన్ మోడ్‌ ఆన్‌ చేసుకుని, మెసేజ్‌లు చూసినా సెండర్స్‌కి తెలియదు. అయితే, మళ్లీ ఎరోప్లేన్ మోడ్‌ ఆఫ్‌ చేయగానే.. దానికి సంబంధించిన స్టేటస్‌ వాళ్లకు తెలిసిపోతుంది.

రికార్డ్​ ఎ సైలెంట్
ఆఫీసులో పని చేస్తున్నప్పుడు వాట్సాప్​ మెసేజ్​ నోటిఫికేషన్​ రింగ్​టోన్ ఇబ్బందిగా ఉంటుంది. అలాగని ఫోన్​ సైలెన్స్​లో పెడితే కాల్స్​ కూడా వినిపించవు. నోటిఫికేషన్స్​ ఆఫ్​ చేద్దామా అంటే కొన్ని ముఖ్యమైన మెసేజ్​లు రావొచ్చు. వాట్సాప్​ను ఒక్కటే సైలెన్స్ గా ఉంచడానికి అవకాశం లేదు. అయితే దీనికో పరిష్కారం ఉంది. అదే సైలెన్స్​రింగ్​టోన్. అంటే మొబైల్​లో రికార్డర్​ ఆన్​ చేసి, కొన్నిసెకండ్లపాటు సైలెన్స్​గా ఉండండి. అంటే ఏ శబ్దం వినపడకుండా రెండు సెకండ్లపాటు సైలెన్స్​నే రికార్డు చేయండి. దీనికో పేరు పెట్టి, సేవ్​ చేసుకోండి. ఇప్పుడు మీరు కాల్,  మెసేజ్​కు రింగ్​టోన్​గా ఈ సైలెంట్​ రికార్డింగ్​ను సెట్​ చేసుకోండి. ఏ మెసేజ్, కాల్ వచ్చినా సైలెంట్​గా ఉంటుంది.

ఒకవేళ ఇబ్బందేం లేదనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్స్​ ఆఫ్​ చేయొచ్చు. దీనివల్ల వాట్సాప్​లో మీకు మెసేజ్​ వచ్చినా మీరు ఓపెన్​ చేసేంతవరకు తెలియకుండా ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్స్​లోకి వెళ్లి లాస్ట్​ సీన్​‘నోబడీ’ సెలెక్ట్​ చేసుకుంటే మీరెప్పుడు చివరిగా వాట్సాప్​ చూశారో కూడా ఎవరికీ తెలీదు.

మీకు మెసేజ్​ వచ్చినా వెంటనే నోటిఫికేషన్​ రాకూడదనుకుంటే ఇంకో ఆప్షన్​ కూడా ఉంది. మొబైల్​ ఫోన్లలో నోటిఫికేషన్​ లైట్​ఉంటుంది. దీన్ని ఆఫ్​ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్​ సెట్టింగ్స్​లో నోటిఫికేషన్​కు వెళ్లి, లైట్​ సెలెక్ట్​ చేసుకుని ‘నన్’ క్లిక్​ చేయాలి. అలాగే మొబైల్​ హోమ్​స్క్రీన్​పై వాట్సాప్​ షార్ట్​కట్​ రిమూవ్​ చేయాలి.

సెట్టింగ్స్ లోకి వెళ్లి, యాప్స్​ సెలెక్ట్​ చేసుకుని, వాట్సాప్​ని ఫోర్స్​ స్టాప్​ చేయాలి. దీనివల్ల వాట్సాప్​కు మొబైల్​ డాటా టర్న్​ ఆఫ్​ అయి, ఎలాంటి మెసేజ్​లు రావు.

Latest Updates