పాక్ ఆటగాళ్లు దేశం కోసం.. భారత ప్లేయర్స్ రికార్డుల కోసం ఆడతారు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్  ఇంజమామ్ ఉల్ హక్ భారత బ్యాట్స్ మెన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్లు దేశం కోసం ఆడతారని.. భారత క్రికెటర్లయితే వారి వ్యక్తిగత రికార్డులకోసమే ఆడతారని ఆయన అన్నాడు. గురువారం ఓ పాకిస్తాన్ యూట్యూబ్ చానల్లో తన టీం మేట్ రజీం రాజాతో మాట్లాడిన ఆయన… ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇంజమామ్ ఆడుతున్న సమయాన్ని ఉద్ధేశించి మాట్లాడిన ఆయన.. తాము మాత్రం అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలో  చాలా బాగా ఆడామని అన్నారు. తన కెరిర్ లో చూసిన బెస్ట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అని చెప్పాడు.

పాకిస్తాన్ ప్లేయర్లు అద్భుతమైన ఆటగాళ్లు అయినప్పటికి కొన్ని సార్లు ఎందుకు ఫేయిల్ అవుతున్నారని అన్న ప్రశ్నకు… సిరీస్ తరువాత సిరీస్ తమ ఆటను మెరుగుపరుచుకుంటూ విజయాలు సాధిస్తుంటే జట్టులో ఉండగలుగుతారని లేకుంటే లేదని అన్నారు ఇంజమామ్. అయితే అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్లేయర్లు కొన్నిసార్లు ఫెయిల్ అయినా వారికి జట్టులో స్ధానం కల్పించేవాడని అన్నారు. ఈ విషయాన్ని మరింత విశదీకరిస్తూ… భారత్ ను టార్గెట్ చేశాడు ఇంజమామ్.

తాము ఆడుతున్న కాలంలో భారత జట్టు పేపర్ పై అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ అని అన్నారు ఇంజమామ్. అయితే పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ రికార్డులకంటే భారత బ్యాట్స్ మెన్ రికార్డులే చాలా మెరుగ్గా ఉండేవని చెప్పారు. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ 30, 40 పరుగులు చేసినా అవి దేశం కోసం చేస్తామని భారత బ్యాట్స్ మెన్ మాత్రం వారి సొంత రికార్డులకోసం చేస్తారని చెప్పారు.

Latest Updates