ఐఫోన్ SE 2020 సేల్స్?

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ నుంచి వస్తున్న ఐఫోన్ ఎస్ఈ 2020 ఇండియాలో రిలీజ్ డేట్ ను ఖాయం చేసుకుంది. గత నెలలో లాంఛ్ అయిన ఈ ఫోన్ సేల్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్స్ ను తమ వెబ్ సైట్ లో అమ్మనున్నట్లు ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తెలిపింది. కానీ దీనిపై యాపిల్ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

యూఎస్ లో ఓ వారం క్రితమే ఐఫోన్ ఎస్ఈ 2020 సేల్స్ షురూ అయ్యాయి. ఇండియాలో మాత్రం మొబైల్ ఫోన్స్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ కేటగిరీలో ఉండటంతో పాటు జోనల్ క్లాసిఫికేషన్ నిషేధం ఉండటంతో డెలివరీలు నిలిచిపోయాయి. ఐఫోన్ ఎస్ఈ 2020 సేల్స్ వచ్చే బుధవారం రాత్రి 12 నుంచి మొదలవనున్నాయి. మొబైల్ ధర 42,500 ఉన్నప్పటికీ లాంచ్ ఆఫర్స్ ఉండే అవకాశం ఉన్నందున కొంత తక్కువకే లభించొచ్చు.

Latest Updates