IPLమ్యాచ్-2 : ఢిల్లీ బ్యాటింగ్

iplఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) మొహలీ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.

ఈ సందర్భంగా పంజాబ్‌‌గా కెప్టెన్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అశ్విన్ మాట్లాడుతూ..ఐపీఎల్ వంటి ఈవెంట్‌లో ఆడటం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ గేమ్స్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లు మా జట్టులో చాలా మంది ఉన్నారు. ఇది ఓ కొత్త ఆరంభం. ఐపీఎల్‌ ఒక దశాబ్ధ కాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రతీ ఫ్రాంచైజీ కొత్త సాంప్రదాయాన్ని రూపొందించుకొనే ప్రయత్నంలో ఉన్నాయి. మా టీంలో స్టోనిస్, మిల్లర్, జాద్రన్, టై నలుగురు విదేశీ ప్లేయర్లు ఆడుతున్నారు అని తెలిపాడు.

అనంతరం ఢిల్లీ జట్టు కెప్టెన్ గంభీర్ మాట్లాడుతూ.. నా సొంత గూటికి చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మ్యాచ్‌ని మేం అంతా కలిసి మలుపు తిప్పుతామని భావిస్తున్నా. మైదానంలో మా సత్తాని చాటేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తాం. మున్రో, క్రిస్టెయిన్, మోరిస్, బౌల్ట్ నలుగురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాం అని తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates