IPLలో కోహ్లీ మరో రికార్డ్

IPL KOHLIటిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. IPL లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ లిస్టులో సురైష్ రైనా టాప్ లో ఉండగా..లేటెస్ట్ గా కోహ్లీ చేరాడు. IPL సీజన్-11లో భాగంగా మంగళవారం (ఏప్రిల్-17) ముంబైతో జరిగిన మ్యాచ్ లో రికార్డ్ సాధించాడు విరాట్.   ఈ మ్యాచ్ లో కోహ్లీ 92 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ కి ముందు కోహ్లీ..రైనా కంటే 31 రన్స్ వెనుకంజలో ఉన్నాడు. అయితే RCB తరుఫున కోహ్లీ ఇప్పటివరకు 5 వేల 43 రన్స్ చేశాడు. IPL, టీ20 లో కలిపి 5వేలకు పైగా రన్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్ గా కోహ్లీనే.

IPL ప్రారంభం నుంచి కోహ్లీ RCBకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక ప్రాంచైజీ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ కూడా కోహ్లీనే కావడం విశేషం.  చెన్నై సూపర్‌ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా 4వేల 558 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో రైనా ఆడలేదు. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ ల్లోనూ రైనా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ (4వేల345), గౌతమ్‌ గంభీర్‌ (4వేల210) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టోర్నీ ముగిసేసరికి ఎవరు ఏ స్థానాల్లో ఉంటారో చూడాలి.

Posted in Uncategorized

Latest Updates