IPL ఎలిమినేటర్ మ్యాచ్ : కోల్ కతా బ్యాటింగ్

IPL RR KKRIPL సీజన్-11లో భాగంగా బుధవారం (మే-23) ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతాతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి రెండు టీమ్స్. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచుల్లో 8 విక్టరీలతో కోల్‌ కతా(16) మూడో స్థానంలో నిలిస్తే..ఏడు మ్యాచ్‌ ల్లో గెలుపు అందుకున్న రాయల్స్(14) నాలుగో స్థానం దక్కించుకుంది.

డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో పాటు పంజాజ్ తమ ఆఖరి మ్యాచ్‌ ల్లో ఓడటంతో రాజస్థాన్‌ కు ప్లేఆఫ్ అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య పోరులో రాజస్థాన్‌ పై కోల్‌ కతాకే రెండు సార్లు విజయం వరించింది. హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌ లో మ్యాచ్ జరుగుతుండటం కార్తీక్‌ సేనకు కలిసొచ్చే అంశం కానుంది. బలాబలాల పరంగా చూస్తే.. రాజస్థాన్ కంటే కోల్‌కతా పటిష్టంగా కనిపిస్తున్నది. హ్యాట్రిక్ విజయాలతో కోల్‌ కతా జోరు మీదుండగా, ఆఖరి మ్యాచ్‌ లో బెంగళూరుపై విజయంతో రాజస్థాన్ టైటిల్ రేసులోకొచ్చింది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ హైదరాబాద్‌ తో శుక్రవారం (మే-25) క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌ లో ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Posted in Uncategorized

Latest Updates