IPL ఎలిమినేటర్ మ్యాచ్ : రాజస్థాన్ టార్గెట్-170

GOUTAMIPL సీజన్-11లో భాగంగా బుధవారం (మే-23) ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో మరోసారి సత్తాచాటారు కెప్టెన్ దినేష్ కార్తీక్, రస్సెల్. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన కోల్ కతాను కెప్టెన్ దినేష్ కార్తీక్ (52) తనదైన స్టైల్లో ఆకట్టుకోగా.. ఫినిష్ టచ్ తో చెలరేగాడు రస్సెల్ (49). రాజస్థాన్ బౌలర్లలో గౌతమ్, ఆర్చర్, లాఫిన్ తలో రెండు వికెట్లు తీయగా శ్రేయాస్ గోపాల్ కి ఒక వికెట్ దక్కింది. ఇందులో గెలిచిన టీమ్ హైదరాబాద్‌ తో శుక్రవారం (మే-25) క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌ లో ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Posted in Uncategorized

Latest Updates