IPL క్వాలిఫయిర్ మ్యాచ్ : చెన్నైతో, హైద్రాబాద్ ఫైట్

CSK-SRHIPL- 11వ సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశను ముగించుకొని…ప్లే ఆఫ్ లో తాడోపేడో తేచ్చుకోవటానికి రెడీ అయ్యాయి నాలుగు టీమ్స్. దీంట్లో భాగంగా మంగళవారం వాంఖేడే స్టేడియంలో హైదరాబాద్-చెన్నై మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది.

అయితే రేపటి మ్యాచ్ 7 గంటలకే ప్రారంభం కానుంది. 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమయితే…ఫ్యాన్స్ కు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో గంట ముందే మ్యాచ్ ను ప్రారంభిస్తున్నారు. రేపటి మ్యాచ్ లో గెలిచిన జట్టు డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన టీమ్… ఫైనల్ ఫైట్ కు అర్హత సాధించేందుకు ఎలిమినేటర్ మ్యాచ్ రూపంలో మరో ఛాన్స్ ఉంటుంది. టెబుల్ టాపర్ గా ఉన్న సన్ రైజర్స్ ను లీగ్ దశలో రెండు సార్లు ఓడించింది చెన్నై. దీంతో సూపర్ కింగ్స్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది రైజర్స్.  రెండు జట్లలో సీనియర్స్ తో పాటు.. యువ ఆటగాళ్లు ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్నారు.

లీగ్ దశలో చెన్నైపై రెండు మ్యాచుల్లో ఓడటంతో… పక్కా స్కెచ్ తో ఎలిమినేటర్ వన్ కు రెడీ అవుతామన్నాడు హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. గెలుపు కోసం అవసరమైతే మార్పులకూ సిద్ధమవ్వాల్సిందేనని టీం మేట్స్ కు హింట్ ఇచ్చాడు. చెన్నై టీమ్ లోని బ్యాటింగ్ లో అంబటి రాయుడు, ధోనీ, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవోలు కీలకం కాగా… సన్ రైజర్స్ జట్టులో కేన్ విలియమ్సన్, ధావన్, మనీష్ పాండే, గోస్వామి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే బౌలింగ్ లో మాత్రం చెన్నైతో పోలిస్తే…రైజర్స్ టీమ్ మెరుగ్గా ఉంది. అయితే చెన్నైపై రెండు మ్యాచుల్లో ఓటమి రైజర్స్ ను కలవరపెడుతోంది. దీంతో చెన్నైకి ఏ రకంగా చెక్ పెట్టాలనే దానిపై వ్యూహాలు రచిస్తోంది రైజర్స్. దీంతో రేపటి మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates