IPL నుంచి ఔట్ : స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం

smithwarneriplబాల్ టాంపరింగ్‌కు పాల్పడి టీమ్‌తోపాటు దేశం పరువు తీసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇక బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన కామరూన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. ఇక స్మిత్, వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించడం గమనార్హం. బాల్ టాంపరింగ్ ఘటనను ఐసీసీ తేలిగ్గా తీసుకున్నా.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం కఠిన చర్యలే తీసుకుంది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్స్ సౌతాఫ్రికా నుంచి అర్ధంతరంగా ఇంటికి తిరిగొచ్చేసిన విషయం తెలిసిందే. స్మిత్ సిడ్నీ రాగానే పబ్లిక్‌గా ఈ బాల్ టాంపరింగ్‌పై స్పందించనున్నాడు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాలపై ప్లేయర్స్ మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

IPL నుంచి ఔట్

బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ IPLలో ఆడే అవకాశం కోల్పోయారు. వాళ్లిద్దరినీ IPLలో అనుమతించకూడదన్న BCCI నిర్ణయాన్ని IPL చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ ఇద్దరిపై ఏడాది నిషేధం విధిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించగానే.. బోర్డు నిర్ణయాన్ని శుక్లా చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత స్మిత్, వార్నర్ తమకుతాము రాజస్థాన్, హైదరాబాద్ జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ఈ ఇద్దరి స్థానంలో వేరే ప్లేయర్స్‌ను తీసుకునే అవకాశం ఈ రెండు ఫ్రాంచైజీలకు ఉన్నట్లు శుక్లా స్పష్టంచేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. వాళ్లే నిషేధించిన తర్వాత ఆ ఇద్దరినీ IPL ఆడించడంలో అర్థం లేదని.. ఈ సీజన్‌లో మాత్రం వాళ్లు ఆడరని తెలిపారు శుక్లా.

Posted in Uncategorized

Latest Updates