IPL పైనల్ : హైదరాబాద్ బ్యాటింగ్

tossIPL సీజన్ -11 క్లైమాక్స్ కి చేరింది. ఆదివారం (మే-27) ముంబైలోని వాంఖడే వేదికగా SRHతో జరురుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై.  ఘనమైన రికార్డును నిలబెట్టుకుంటూ ఫైనల్‌ చేరిన ధోని జట్టు, అసలు అంచనాలే లేని స్థితి నుంచి అద్భుతంగా పైకెదిగిన విలియమ్సన్‌ సేన. ఎవరు గెలిచినా ఈ సీజన్‌ కది ప్రత్యేక ముగింపే.

ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే రెండు లీగ్‌ మ్యాచ్‌ లు, మొదటి క్వాలిఫయర్‌ లో హైదరాబాద్‌ పై చెన్నైదే పైచేయి. తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ, భారీ లక్ష్యాలను అందుకుంటూ మిగతా ప్రత్యర్థులందరినీ చుట్టేసిన సన్‌ రైజర్స్‌కు… సూపర్‌ కింగ్స్‌ ఒక్కటే కొరకరాని కొయ్యగా మిగిలింది. బ్యాట్స్‌ మెన్‌ అనూహ్య ఇన్నింగ్స్‌ లు, ఆల్‌ రౌండర్ల అండ, బౌలర్ల నిలకడతో దుర్భేద్యంగా ఉన్న చెన్నైని ఓడించాలంటే హైదరాబాద్‌ సమష్టిగా శక్తికి మించి ఆడాల్సిందే. ఫస్ట్ బ్యాటింగ్ కలిసొస్తున్న హైదరాబాద్ కి ఈ మ్యాచ్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఆల్ ద బెస్ట్ SRH.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి

Posted in Uncategorized

Latest Updates