IPL ఫైనల్లో సూపర్ కింగ్స్ : ప్లే ఆఫ్ లో హైదరాబాద్ బోల్తా

chennaiఐపీఎల్ 11 సీజన్ లో ఫైనల్ కు చేరింది చెన్నై సూపర్ కింగ్స్. హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. హైదరాబాద్ విధించిన 140 రన్స్ టార్గెట్ ను మరో 5 బాల్స్ మిగిలి ఉండగానే చేజ్ చేసింది చెన్నై. సూపర్ కింగ్స్ ప్లేయర్ డూప్లెసిస్ హాఫ్ సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమ్ ను గెలిపించాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 42 బాల్స్ లోనే 67 రన్స్ చేశాడు డూప్లెసిస్. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా… టెయిలెండర్ల సపోర్టుతో చెన్నైను గెలిపించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం.. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అట్టర్ ప్లాఫ్ షో ప్రదర్శించింది. లీగ్ దశలో ప్లేయర్స్ అంతా అదరగొట్టినా… కీలకమైన మ్యాచ్ కు వచ్చే సరికి బ్యాట్లు ఎత్తేశారు. బ్రాత్ వైట్ 29బంతుల్లో ఒక ఫోర్ 4 సిక్సర్లతో 43 రన్స్ చేసి  చేయడంతో… టీం స్కోర్ 7 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసింది.

క్వాలిఫయర్ 1 ఫస్ట్ మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు.. ఫైనల్ వెళ్లిందుకు మరో అవకాశం ఉంది. ఇవాళ రాజస్థాన్ – కోల్ కతా జట్ల మధ్య జరిగే ఎలిమినేషన్  మ్యాచ్ లో గెలిచిన టీంతో.. ఈ నెల 25న క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే… ఈ నెల 27న చెన్నైతో జరిగే ఫైనల్ లో పోటీ పడనుంది.

Posted in Uncategorized

Latest Updates