IPL బెట్టింగ్ మాఫియా : లింక్ నిజమే.. అర్బాజ్ కు రూ.3 కోట్ల నష్టం

ipl2017 IPL మ్యాచ్ ల్లో బెట్టింగ్ లకు పాల్పడినట్లు బాలీవుడు నటుడు, నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ థానే పొలీసుల విచారణలో అంగీకరించాడు. శనివారం(జూన్-2) ఉదయం థానే పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అర్భాజ్ ఖాన్.. బెట్టింగ్ వల్ల రూ. 2.75 కోట్లు నష్టపోయినట్లు పోలీసుల ఎదుట తెలిపాడు. విచారణ జరుగుతూ ఉందని థానే పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై స్పందించిన IPL కమిషనర్ రాజీవ్ శుక్లా… ఈ విషయంలో తాము చెయ్యాల్సింది ఏమీ లేదని.. దీన్ని పోలీసులు చూసుకుంటారన్నారు.

బీసీసీఐ, ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్లు కలిగి ఉన్నాయని, పోలీసులు వారితో సమన్వయం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ బెట్టింగ్ బుకీ సోనూ మంగళవారం(మే-29) అరెస్ట్ చేసిన తర్వాత అతడిని విచారించిన సమయంలో అర్భాన్ ఖాన్ పేరు చెప్పడంతో ఈ కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలంటూ శుక్రవారం(జూన్-1) థానే పోలీసు అధికారులు అర్భాజ్ ఖాన్ కు సమన్లు జారీ చేశారు. అర్బాజ్ ఖాన్ బెట్టింగ్ చేసినట్లు అంగీకరించటం కలకలం రేపుతోంది. నష్టపోయింది కేవలం రూ.2.75కోట్లు మాత్రమేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కనీసం 10 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ ఉందని.. అమౌంట్ ను తక్కువ చేసిన చూపిస్తున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.

Posted in Uncategorized

Latest Updates