IPL మ్యాచ్: చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్- 203

kkr
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లగాను 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చెన్నై చిదంబరం గ్రౌండ్ లో జరుగుతున్న IPL మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్ తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 202 పరుగులు చేసి.. చెన్నైకి 203 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది.

కోల్ కతా ఆటగాళ్లలో ఆండ్రూ ర‌స్సెల్ అత్యధికంగా 88 పరుగులు చేయగా..రాబిన్ ఊతప్ప 29, దినేష్ కార్తీక్ 26, క్రిస్ లిన్ 22 పరుగులు చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో షేన్ వాట్సన్ 2 వికెట్లు తీసుకోగా.. హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, ఠాకూర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates