IPL మ్యాచ్: పంజాబ్ పై చెన్నై విక్టరీ

RainaIPL లెవెన్త్ సీజన్ కూడా పంజాబ్ కు కలిసిరాలేదు. ఫస్ట్ హాఫ్ లో వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసును మొదలుపెట్టిన పంజాబ్… నాకౌట్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. లాస్ట్ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడింది. పంజాబ్ ఔటవడంతో రాజస్తాన్ రాయల్స్ నాకౌట్ కు చేరింది. మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియం వేదిక‌గా ఆదివారం(మే-20) కింగ్స్ లెవెన్ పంజాబ్ జ‌ట్టు, చెన్నై సూప‌ర్ కింగ్స్  మద్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.4 ఓవర్లలో 153 రన్స్ కు ఆలౌట్ అయింది. 154 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన చెన్నై.. మరో ఐదు బాల్స్ మిగిలుండగా మ్యాచ్ ని ఫినిష్ చేసింది. ఫస్ట్ హాఫ్ లో ఏడు మ్యాచ్ ల్లో ఐదు విజయాలు సాధించిన పంజాబ్.. తర్వాతి ఏడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచి మిగతా ఆరింట్లో  ఓడింది. చివరి ఐదు మ్యాచ్ లను వరుసగా ఓడి ప్లే ఆఫ్ కు దూరమైంది. పంజాబ్ నాకౌట్ కు దూరమవడంతో రాజస్తాన్ రాయల్స్ నాలుగో టీంగా నాకౌట్ కు చేరింది. అంతకుముందు హైదరాబాద్, చెన్నై, కోల్ కతా వరుసగా ప్లే ఆఫ్ కు చేరాయి.

Posted in Uncategorized

Latest Updates