IPL మ్యాచ్-11 : RCB ఫీల్డింగ్

viratkohlifanstossబెంగ‌ళూరు సొంతగడ్డపై విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB మరోసమరానికి రెడీ అయింది. ఆదివారం (ఏప్రిల్-15) చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చిన్నస్వామిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ పై గెలిచి బోణీ కొట్టిన విరాట్ సేన రాజస్థాన్‌ పై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

సొంతమైదానంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అనూహ్యంగా గెలుపొందిన రహానె కెప్టెన్సీలోని రాజస్థాన్ పూర్తిస్థాయి ప్రదర్శన చేసి ఆకట్టుకునే స్థాయిలో రాణించాలని భావిస్తోంది. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే రహానెసేన బరిలో దిగుతోంది. మరోవైపు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో పవన్ నేగిని విరాట్ తుది జట్టుకు ఎంపిక చేశాడు.

Posted in Uncategorized

Latest Updates