IPL మ్యాచ్-13 : ఢిల్లీపై కోల్ కతా ఘన విజయం

IPLIPL సీజన్-11 లో రికార్డు క్రియేట్ చేసింది కోల్ కతా నైట్ రైడర్స్. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు కేకేఆర్ టీమ్ మెంబర్స్. బ్యాటింగ్.. బౌలింగ్ లోనే దుమ్ము దులిపారు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్ మెన్ రాణించడంతో.. కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు ఈజీ అయింది. ఆల్ రౌండ్ షోతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ను చిత్తుచిత్తుగా ఓడించి రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం (ఏప్రిల్-16) ఈడెన్ గార్డెన్ లో జరిగిన పోరులో ఢిల్లీపై 71 పరుగుల తేడాతో విజయం సాధించింది నైట్ రైడర్స్. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 14.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది.

Posted in Uncategorized

Latest Updates