IPL మ్యాచ్-2 : ఢిల్లీపై పంజాబ్ విక్టరీ

punjabఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) మొహలీ వేదికగా డిల్లీతో జరుగిన మ్యాచ్ లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో 167 పరుగులు చేసి విజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. చేశాడు. 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగి ఆడి సరికొత్త రికార్డును నమోదు చేసి, పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోశించాడు.
పంజాబ్ ప్లేయర్లలో రాహుల్(51), కరుణ్ నాయర్(50), మిల్లర్(24), స్టోనిస్(22) యువరాజ్(12),అగర్వాల్ (7) పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంబీర్(55) హాఫ్ సెంచరీ వృదా అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates