IPL మ్యాచ్ -3 : కోల్ కతా టార్గెట్-177

RCBఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL సీజన్-11లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) ఈడెన్ గార్డెన్ వేదికగా కల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆరంభంలోనే చావ్లా వేసిన 2వ ఓవర్ నాలుగో బంతిని రివర్స్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన బెంగళూరు ఓపెనర్ డికాక్(4) అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న దినేష్ కుమార్‌కి క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూం బాటపట్టాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మెక్కల్లమ్ టీమ్ కు అండగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే సునీల్ నరేన్ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి మెక్‌కల్లమ్(43) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఈ దశలో కోహ్లీ, డివిలియర్స్‌ల జోడీ జట్టుని ఆదుకుంది. మూడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, జట్టుకి గౌరవప్రదమైన స్కోర్‌ను అందించింది. అయితే నితీస్ రానా వేసిన 15 ఓవర్‌‌లో డివిలియర్స్(44), కోహ్లీ(31) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. అయితే ఆఖర్లో మన్‌దీప్ సింగ్(37) మెరుపులు మెరిపించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలింగ్‌లో రానా, వినయ్ 2, చావ్లా, నరేన్, జాన్సన్ తలో వికెట్ తీశారు.

Posted in Uncategorized

Latest Updates