IPL మ్యాచ్-3 : RCB బ్యాటింగ్

rcb-siteఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) కోల్ కతాలో బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కోల్ కతా. ఈ సందర్భంగా కోల్‌కతా కెప్టెన్‌ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ..పిచ్ చాలా అద్భుతంగా ఉందని.. అందుకే మేం టార్గెట్‌ని చేధించాలని అనుకున్నామని తెలిపాడు. ఇది చాలా గొప్ప పోటీ అని అనుకుంటున్నానని.. మా టీంలో క్రీస్ లిన్, సునీల్ నరైన్, అర్నాల్డ్ రస్సెల్, మిషెల్ జాన్సన్ నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు. అనంతరం బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. వికెట్ చాలా బాగుంది. మేం టాస్ గెలిచినా బౌలింగ్‌ ఎంచుకొనే వాళ్లం. ఐపీఎల్‌లో తొలిసారిగా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమంగా ఉన్నాం. డివిలియర్స్, మెక్‌కల్లమ్, డికాక్, వోక్స్‌ నలుగురు విదేశీ ఆటగాళ్లతో మేం బరిలోకి దిగుతున్నాం అని తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates